ఎక్స్ ట్రీమ్లీ మెచ్యూర్ అండ్ రియల్లీ ఫన్నీ… గా అభివర్ణించాడు మాధవన్. ఇండియన్ కాన్ఫరెన్స్ అట్ హార్వర్డ్ లో ప్రసంగించాడు మాధవన్. ఇదే సదస్సులో తెలుగు నటుడు పవన్ కల్యాన్ కూడా ప్రసంగించిన విషయం తెలిసిందే.
ప్రతియేటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఇండియన్ విద్యార్థులు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేవలం విద్యార్థుల చేత నిర్వహించబడే అతి పెద్ద సదస్సుగా దీనికి పేరుంది. ఈ కార్యక్రమానికి పలు భారతీయ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు దక్కాయి. వారిలో పవన్ కల్యాణ్, మాదవన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా తదితరులున్నారు.
హర్వర్డ్ లోని భారతీయ విద్యార్థులు ఇచ్చిన ఆతిథ్యం అద్భుతం అని మాధవన్ అన్నాడు. అక్కడి తన ప్రసంగం వీడియోను, ఫొటోలను షేర్ చేశాడు ఈ హీరో.