టైమ్ బాగు లేకుంటే ఓడలు బళ్లు అయిపోతాయ్..నిన్నటి రోజున కాజల్ అంటే టాప్ హీరోయిన్..ఇప్పుడు అలాంటి ప్లేస్ లో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరింది. టాప్ చైర్ లో కూర్చుని కదలడం లేదు. కాజల్ కు మాత్రం ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి. వరుస ఫ్లాప్ లతో మరి తెలుగు సినిమాల్లో హీరోయిన్ చాన్స్ లపై ఆశలు వదులుకున్నట్లే అయిపోయింది.
ఇప్పుడు అలాంటి కాజల్ కు ఓ తెలుగు సినిమా అవకాశం వెదుక్కుంటూ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరోయిన్ గా కాదు. జస్ట్ అయిటమ్ సాంగ్ కోసం. మంచి చాన్స్ లు వున్నపుడే తమన్నా లాంటి హీరోయిన్ ఐటమ్ సాంగ్ లు చేసింది. అలాంటిది చాన్స్ లేని కాజల్ చేస్తే ఏమయింది? అందుకే ఓకె అనేసినట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి. పైగా అది మెగా వారసుడు రామ్ చరణ్ సినిమా కదా..గౌరవంగానే వుంటుంది.