'నోట్' దిస్ పాయింట్ బాబూ

ఇకపై పల్లె మహిళలు కూడా అన్నీ ఆన్ లైన్ లోనే చెల్లింపులు చేయాలని, అందుకు వీలుగా అందరికీ ఫ్రీగా ఫోన్ లు కూడా ఇస్తామంటున్నారు. నోట్ల రద్దు తన ఘనతే అని చెప్పుకుని, తీరా దాని వల్ల ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారని అర్థమైన చంద్రబాబు, ఇప్పుడు ఆ సమస్యను తాను పరిష్కరించేసాననే క్రెడిట్ దక్కించుకునే పనిలో పడ్డారు. కానీ ఆయన నేల విడిచి సాము చేస్తున్నారు. ఆయన్ను మోస్తున్న మీడియా కూడా వాస్తవాలు మరిచి, ఆయన మాటల్నే ప్రచారం చేస్తోంది. 

అసలు మన పల్లెటూళ్లలో త్రీజీ నెట్ వర్క్ సదుపాయం వున్న గ్రామాలు ఎన్ని? 

టూ జీ నెట్ వర్క్ మీద, బ్యాంకుల సైట్లు పనిచేసే స్పీడెంత?

అసలు ఫోన్ నెట్ వర్క్ లేని గ్రామాల పరిస్థితి ఏమిటి?

రైతులు తమ సరకులను బజారుకు తీసుకెళ్తారు. మరి స్వయిపింగ్ మిషన్లు రైతులు కొనుగోలు చేసుకోవాలా? అందరికీ కలిపి ఒక కౌంటర్ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తారా? అలా అయితే ఆ డబ్బులు రైతు అక్కౌంట్ లోకి ఎప్పుడు వస్తాయి.?

మన పట్టణాల్లో బళ్ల మీద రోడ్ల పక్కన అమ్మకాలు జరిపే హాకర్ల సంఖ్యే ఎక్కువ. వీరే మన నాయకుల ఓట్ బ్యాంక్ కూడా మరి వీరంతా కూడా స్వయిపింగ్ మెషీన్లు తీసుకుంటారా?

గడచిన పది రోజులుగా స్వయిపింగ్ మెషిన్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పక్కా షాపులు వున్నవారంతా మెషీన్లు తీసుకున్నారు. దీంతో బ్యాంకుల సర్వర్లు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఒకటికి పది సార్లు స్వయిప్ చేస్తే తప్ప, పని జరగడం లేదని దుకాణ దారులు గోల పెడుతున్నారు. ప్రభుత్వరంగంలోని రైల్వే టికెట్ ఆన్ లైన్ వ్యవస్థ ఎంత అల్లరి పెడుతుందో జనాలకు అనుభవమే. 

భయంకరంగా ఆదాయం లభించే ఆ సైట్ ను ఇంప్రూవ్ చేయడానికే ఏళ్లూ పళ్లూపడుతోంది. మరి బ్యాంకు సర్వర్ లు ఇప్పట్లో అప్ గ్రేడ్ అయ్యే పనేనా? 

బ్యాంక్ మెసేజ్ లు, బ్యాంకుల ఇంట్రాక్టివ్ వాయిస్ సిస్టమ్ లు, వాటి భాష, ఏక్సెంట్ వాడే పరిస్థితి మన గ్రామాల్లో ఏ మేరకువుంది? 

రిక్షా, ఆటో, పేపర్లు, మ్యాగ్ జైన్లు అమ్మే హాకర్లు,ఇలా ఎక్కడిక్కడ మనీ ట్రాన్సాక్షన్ లేకుండా చేయగల పరిస్థితి ఇప్పట్లో వుందా? 

ఇప్పుడున్న ఈ సమస్య తీరాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది అంటున్నారు ఆయా రంగాల నిపుణలు. మరి అప్పటి వరకు ఈ అనార్గనైజ్డ్ రంగాల పరిస్థితి ఏమిటి? 

బాబుగారు చెబుతున్న కబుర్లు విని, ఆయన అనుకూల మీడియా వండుతున్న వార్తలు చదివి నిట్టూర్చడం తప్ప,.

Show comments