రాయ్‌ లక్ష్మీకి ఆ అనుభవం ఎదురవలేదట

రాయ్‌ లక్ష్మీగా పేరు మార్చుకున్న లక్ష్మీరాయ్‌కి తెలుగులో తొలి సినిమా 'కాంచనమాల కేబుల్‌ టీవీ'. ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర బొక్క బోర్లా పడ్డంతో మళ్ళీ, తెలుగు సినిమాల్లో ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలమే పట్టింది. లారెన్స్‌ రూపొందించిన 'కాంచన' పుణ్యమా అని మళ్ళీ లక్ష్మీరాయ్‌ కెరీర్‌లో ఊపొచ్చింది. మొన్నీమధ్యనే, చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేసింది లక్ష్మీ రాయ్‌. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమా చేస్తోన్న లక్ష్మీరాయ్‌, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఈ లైంగిక వేధింపులు వుంటున్నాయని పెద్ద బాంబే పేల్చింది లక్ష్మీ రాయ్‌. ఇంతకీ, లక్ష్మీ రాయ్‌ కూడా అలాంటి వేధింపుల్ని ఫేస్‌ చేసిందా.? అంటే, లేదట. ఆ విషయంలో తాను చాలా లక్కీ అని చెబుతోందీ బ్యూటీ. 

భలే తెలివిగా సమాధానమిచ్చింది కదా.! ఈ మధ్య లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి, లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాల్ని వెల్లడిస్తే, వారి గట్స్‌ని అందరూ మెచ్చుకోవడం మామూలే. కానీ, తనకు 'అలాంటి' అనుభవం ఎదురవలేదంటూనే, అన్ని సినీ పరిశ్రమలపైనా లక్ష్మీరాయ్‌ అంతలా ఎలా అబాంఢాలు వేసేసిందట.? ఏమో మరి, ఆమెకే తెలియాలి. 

ఒక్కటి మాత్రం నిజం. సమాజంలోని అన్ని రంగాల్లోనూ మహిళలపై లైంగిక వేధింపులున్నాయి. రాజకీయాల్లోనూ తప్పడంలేదివి. అలాంటిది, సినీ పరిశ్రమలోనూ వుండొచ్చుగాక. కానీ, సినీ రంగమంటే గ్లామర్‌ ప్రపంచం కదా.! ఇక్కడ లైంగిక వేధింపులు వున్నా లేనట్టే, లేకపోయినా వున్నట్లే.!

Show comments