పూరీ ట్వీటేసాడు

మొత్తానికి నిన్నటికి నిన్న చెప్పినట్లే బాలయ్య బాబు 101 సినిమా ప్రకటన వచ్చేసింది. అది కూడా దర్శకుడు పూరి జగన్నాధ్ ట్వీట్ రూపంలో. రాకింగ్ అనౌన్స్ మెంట్ వెంచర్ విత్ నందమూరి బాలకృష్ణ సర్ విత్ భవ్య క్రియేషన్స్ అంటూ పూరి ట్వీట్ చేసాడు. అంతే కాదు..మార్చి 9న ముహుర్తం అని సెప్టెంబర్ 29న విడుదల అంటూ. పూరి జగన్నాధ్ స్టయిలే అంత.

సినిమాకు కొబ్బరికాయ కొట్టకుండానే విడుదల తేదీ చెప్పేయడం. దసరా బరిలోకి దిగబోతున్నారన్నమాట బాలయ్య, పూరి కలిసి. ఇప్పటి వరకు దసరాకు రుమాలు వేసుకున్న సినిమా ఏదీ లేదు. రెడీ అయ్యే సినిమాలు కూడా పెద్దగా లేవు. ఒక్క ఎన్టీఆర్-బాబీ సినిమా కే కాస్త అవకాశం వుంది. మార్చి తొమ్మిది నుంచి సెప్టెంబర్ 29 వరకు అంటే జస్ట్ ఆరునెలల్లో ఫినిష్ చేసేస్తాడన్నమాట సినిమాను పూరి.

Show comments