బ్రేకింగ్ న్యూస్ : పవన్ సినిమాలో వెంకటేశ్?

వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయాన్ని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. గోపాల గోపాల సినిమాలో వెంకీ లీడ్ రోల్ చేస్తే, భగవంతుడిగా పవన్ కనిపిస్తాడు.

ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు పవన్-వెంకీ. అవును.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో మెరవనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సారథి స్టుడియోస్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే వెంకటేష్ పై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. నిజానికి ఈ మేటర్ ను సీక్రెట్ గా ఉంచాలని యూనిట్ ట్రై చేసింది. కానీ ఇలాంటివి అస్సలు దాగవు కదా. పవన్ సినిమాలో వెంకీ నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ అంతా వ్యాపించేసింది.

కథ ప్రకారం ఇది కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాదంటున్నారు. వెంకీ కోసం త్రివిక్రమ్ కొన్ని మంచి సన్నివేశాలతో పాటు పదునైన డైలాగులు కూడా రాశాడట.

సినిమాలో ఉండేది తక్కువ నిడివే అయినప్పటికీ.. వెంకీ తన మార్క్ చూపించబోతున్నాడట. అయితే మూవీలో పవన్-వెంకీ కలిసి ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Show comments