బాలీవుడ్‌లో రెజినా కెవ్వుకేక.!

టాలీవుడ్‌లోనే గ్లామర్‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది రెజినా. బాలీవుడ్‌లో ఊరుకుంటుందా.? తొలి సినిమా 'ఆంఖేన్‌-2'లో అవకాశం దక్కించుకున్న రెజినా, సినిమా అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమంలోనే గ్లామర్‌తో సత్తా చాటేసుకుంది. 'ఆంఖేన్‌' సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, అనిల్‌కపూర్‌ తదితరులు నటిస్తుండడం గమనార్హం. 

రెజినాతోపాటు అమితాబ్‌ బచ్చన్‌ ఈ కార్యక్రమంలో సరదాగా ఆడిపాడారు. ఫ్యాషన్‌ షో నిర్వహించినా, అందులోనూ రెజినా గ్లామరే హైలైట్‌ అయ్యింది. సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి అందాల భామలు వెళ్ళడం కొత్తేమీ కాదు. సౌత్‌ నుంచి బాలీవుడ్‌లో సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో వున్నారు. బాలీవుడ్‌లో అవకాశాలొచ్చాక, సౌత్‌ని మర్చిపోయిన హీరోయిన్లూ వున్నారు. 

ప్రస్తుతం తెలుగులో రెజినా 'నక్షత్రం' సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది రెజినా. బాలీవుడ్‌లో సినిమా చేయడం అంటే, ఎక్కువగా ముంబైలోనే వుండిపోవాల్సి వస్తుంది. మరి, తెలుగు సినిమాలకి రెజినా టైమ్‌ ఎలా కేటాయిస్తుందట.? రెజినా మాత్రం బాలీవుడ్‌కి వెళ్ళినా, సౌత్‌ సినిమాల్ని వదిలే ప్రసక్తే లేదని చెబుతోంది.

Show comments