బస్తీ మే సవాల్‌: సినిమా లీకైంది

'సింగం-3' సినిమా లీకైపోయింది. ఆన్‌లైన్‌లో సినిమాని ముక్కలు ముక్కలుగా పోస్ట్‌ చేసేశారు. సినిమాకి సంబంధించి చాలా సీన్లు ఇప్పుడు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ఆపసోపాలు పడి.. ఆ మాటకొస్తే, బాలారిష్టాలు ఎదుర్కొని.. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే పురిటినొప్పులు అనుభవించి సినిమాని విడుదల చేశారు 'సింగం-3' నిర్మాతలు. సినిమా నిర్మాణం కన్నా, దాన్ని రిలీజ్‌ చేయడమే పెద్ద ప్రసహనమైపోయింది మరి.! 

ఇంతా చేస్తే, సినిమా ఆన్‌లైన్‌లో లీకయ్యిందన్న వార్త చిత్ర దర్శక నిర్మాతల్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేయకుండా వుంటుందా.? చాలా సినిమాల విషయంలో ఈ లీకేజీ పెద్ద సమస్యగా మారిపోయింది. 'సింగం-3' సినిమాకి అయితే, ముందే చెప్పి సినిమాని లీక్‌ చేసేశారు ఆన్‌లైన్‌ లీకు వీరులు. తమ సినిమాని లీక్‌ చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారంటూ చిత్ర దర్శక నిర్మాతలు వాపోయినా.. పట్టించుకునే నాథుడే లేడాయె. 

'అత్తారింటికి దారేది' సినిమా విడుదలకు ముందే లీకయ్యింది. 'బాహుబలి' సినిమాకీ లీకుల బెడద తప్పలేదు. లీకులకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలు అసలే లేవు. సినిమా అనగానే పైరసీ లేదా లీకేజీ.. అన్న మాటా విన్పిస్తోందిప్పుడు. దర్శక నిర్మాతలు ఏం చేసినా సరే, ప్రభుత్వాలూ కల్పించుకుంటే తప్ప ఈ లీకుల సమస్య సినీ పరిశ్రమను వదలదు. 'బస్తీ మే సవాల్‌' అంటూ లీకు వీరులు చెప్పి మరీ సినిమాని లీక్‌ చేస్తోంటే, కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తోన్న నిర్మాతలు ఏమీ చేయలేక, ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంటారు సినీ ప్రముఖులు. వారి ఆవేదన ఆ స్థాయిలో వుంటోంది.

Readmore!
Show comments

Related Stories :