హరీష్ తోనా ? వాటే జోక్?

హరీష్ శంకర్ తో రాజ్ తరుణ్ సినిమా అని గ్యాసిప్ గుప్పుమంది. దీనికి ముందు హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేసారు. అమెరికాలో వున్నా. లోకేషన్లు చూసుకుంటున్నా అంటూ. కానీ ఆలూలేదు, చూలూలేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు, ప్రాజెక్టు లేదు, హీరో లేడు, సినిమా ఏమిటా అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించాయి. దాని తరువాత ఈ గ్యాసిప్ గుప్పుమంది.

అయితే పక్కా నిజం ఏమిటంటే రాజ్ తరుణ్ ఏ సినిమా కూడా హరీష్ శంకర్ తో కమిట్ కాలేదు. దిల్ రాజుకు సినిమా కమిట్ అయిన మాట వాస్తవమే కానీ, అది హరీష్ శంకర్ తో మాత్రం కాదు. ఈ విషయమై రాజ్ తరుణ్ సన్నిహిత వర్గాలను సంప్రదిస్తే 'హరీష్ తో రాజ్ తరుణ్ నా? వాటే జోక్ అని కొట్టి పడేసాయి. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఫుల్ బిజీగా వున్నారని, దిల్ రాజు సినిమాకు కథ, డైరక్టర్ ను ఇంకా ఫిక్స్ చేసుకోవాల్సి వుంది. అది కచ్చితంగా హరీష్ శంకర్ అయితే కాదని ఆ వర్గాలు వెల్లడించాయి. 

హరీష్ శంకర్ తో నిఖిల్ కానీ, రాజ్ తరుణ్ కానీ సినిమా ఏదీ కమిట్ కాలేదని గతంలోనే గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసిందే.

Show comments