పవన్‌కళ్యాణ్‌కీ సారీ చెప్తాడా మరి.?

ఏ ఎండకి ఆ గొడుగు పట్టడంలో తనకు సాటి ఎవరూ రారన్పించుకుంటున్నాడేమో రామ్‌గోపాల్‌ వర్మ. ఎందుకంటే, ఒకప్పటి వర్మ వేరు. ఇప్పటి వర్మ వేరు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ వర్మ కాస్తా, ఇప్పుడు సోషల్‌ మీడియాలో పులిలా రెచ్చిపోతూ, అక్కడే అప్పుడప్పుడూ పిల్లిలానూ మారిపోతున్నాడు మరి. 

గతంలో మెగాస్టార్‌ చిరంజీవిని నానా రకాలుగా విమర్శించాడు ఇదే వర్మ. చిరంజీవినే కాదు, చిరంజీవి అభిమానుల్నీ.. వీలు చిక్కినప్పుడల్లా పవన్‌నీ, పవన్‌ అభిమానుల్నీ కెలికేస్తూ వచ్చిన వర్మ, ఇప్పుడెందుకో మెగాస్టార్‌ అభిమానులకీ, చిరంజీవి అభిమానులకీ సారీ చెప్పేశాడు. చిరంజీవి కొత్త సినిమా 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా లుక్‌ చూసి వర్మ స్పెల్‌ బౌండ్‌ అయిపోడట. అంతే, ఇదివరకు చేసిన విమర్శలకుగానూ అభిమానులు తనను క్షమించాలని వర్మ కోరేశాడు. 

మెగాస్టార్‌ చిరంజీవి లుక్‌ వచ్చింది గనుక, వర్మ మెగా అభిమానులకి క్షమాపణ చెప్పాడు. రేప్పొద్దున్న పవన్‌కళ్యాణ్‌ లుక్‌ వస్తే, అప్పుడు మళ్ళీ పవన్‌ అభిమానులకి సారీ చెప్తాడేమో. పవన్‌ అభిమానులకి సారీ చెప్పినా, పవన్‌కి సారీ చెప్పినా ఒక్కటే కదా.! ఆగండాగండీ, అప్పుడే కథ అయిపోలేదు. సినిమాలు రిలీజ్‌ అవ్వాలి కదా. అప్పుడు మళ్ళీ, వర్మ ఏకిపారేయకుండా వుంటాడా.? అప్పుడు ఏకిపారేయడానికే ఇప్పుడీ క్షమాపణలు. దటీజ్‌ వర్మ.

Show comments