వామ్మో ఇలియానా.!

ఇలియానా బాలీవుడ్‌లో 'రుస్తుం' అనే సినిమాలో నటిస్తోన్న విషయం విదితమే. అక్షయ్‌కుమార్‌ ఇందులో హీరో. నేవీ అధికారిగా ఇందులో అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నాడు. ఓ రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్‌ని బేస్‌ చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఇలియానా ఈ సినిమా కోసం డిఫరెంట్‌ లుక్‌ ట్రై చేసింది. 

వాస్తవానికి 'రుస్తుం' టీజర్‌ ఇప్పటికే బయటకు వచ్చేసింది. సినిమాలో ఇలియానా లుక్‌ కూడా రివీల్‌ అయ్యింది. తాజాగా ఇలియానా మరో 'న్యూ లుక్‌'ని విడుదల చేసింది. 'వామ్మో ఇలియానా' అనేంత భయంకరంగా ఉందీ లుక్‌. ఇలియానా ఉద్దేశ్యం ఏంటోగానీ, అమ్మమ్మ తరహాలో ఇలియానా కన్పిస్తోందని ఈ ఫొటోకి అభిమానులే రిప్లై ఇస్తున్నారు. 

సోషల్‌ మీడియాలో ఇలియానా చాలా చాలా యాక్టివ్‌గా వుంటోంది హాట్‌ హాట్‌ ఫొటోలతో ఇలియానా సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తెలుగులో హీరోయిన్‌గా ఒకప్పుడు టాప్‌ పొజిషన్‌ని సొంతం చేసుకున్న ఇలియానా, ఆ తర్వాత కెరీర్‌లో వరుస వైఫల్యాల్ని చవిచూసింది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైపోయిన ఇలియానా, మంచి ఛాన్సులొస్తే ఎప్పుడైనాసరే తెలుగులో నటించడానికి సిద్ధమంటోందిగానీ, తెలుగు నుంచే ఆమెకు పెద్దగా అవకాశాలు రావడంలేదు. 

ఏదో 'సరదాకి' అన్నట్లు ఈ ఫొటోలు పనికొస్తాయిగానీ, ఈ ఫొటోలు ఆమె కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.

Show comments