రానా చెవి బంగారం వెనుక

ఆ మధ్య ఉన్నట్లుండి రానా చెవికి టాప్ లో చిన్న బంగారం తొడుగుతో తళుక్కన మెరిసాడు. ఏమిటిదంతా? అంటే బ్లూ ప్లానెట్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తొలిసారిగా నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలో స్టిల్ అని బయటకు వచ్చింది. ఒకే, ఇదో ఫ్యాషన్ క్రియేట్ చేయబోతున్నాడన్న మాట రానా? అని అందరూ అనుకున్నారు. 

కానీ ఫ్యాషన్ కాదట విషయం. సినిమాలో కీలకమైన సన్నివేశానికి ఈ బంగారపు తొడుగుకు లింక్ వుందట. తెలుస్తున్న విషయం ఏమిటంటే, నేనే రాజు నేనే మంత్రి సినిమా ఓ ఎమోషనల్ పొలిటికల్ డ్రామా అన్న సంగతి తెలిసిందే.

అలాంటి కథలో ఓసారి హీరో రానా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. బుల్లెట్ చెవికి రాసుకుంటూ వెళ్తుంది. దాంతో చెవికి టాప్ లో చిన్న గాయం అవుతుందన్న మాట. దాన్ని కవర్ చేయడానికి రానా ఈ బంగారం తొడుగు తో కనిపిస్తాడట.

అదీ విషయం. ఇదేదో వెరైటీగానే వుంది. ఇకపై కుర్రాళ్లు దీన్ని ఫాలో.. ఫాలో అని ఫాలో అయిపోయినా ఆశ్యర్యం లేదు. ఈ సినిమాలో రానా సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కేధరిన్ ఓ ప్రత్యేక పాత్రలో తళుక్కున మెరవబోతోంది.

Show comments