బన్నీ చీఫ్ గెస్ట్ గా..

ఇఫ్పుడు టాలీవుడ్ లో అడియో ఫంక్షన్లకు పెద్ద దిక్కులు అంటూ ఎవరూ పెద్దగా లేరు. రాఘవేంద్రరావు ఇలాంటి ఫంక్షన్ లకు అంతగా రారు. దాసరి నారాయణరావు వస్తారు కానీ, మరీ ఎక్కువగా కాదు. చాలా మందిని తన ఇంటికే పిలిచి పేరంటం పెట్టమంటారు. ఒక్కప్పుడు ఎన్టీఆర్ ఇలాంటి ఫంక్షన్ లకు ఎక్కువగా వచ్చేవారు. కానీ రాను రాను తగ్గించారు. 

ఎక్కడో ఏదో కనెక్షన్ వుంటే తప్ప పవన్ రారు.  ఎవరి సంబంధ బాంధవ్యాలుున్న వారి పంక్షన్లకు వారు వస్తున్నారు తప్ప, మిగిలిన వాటికి సరైన అతిధులు దొరకడం లేదు. అందుకే చాలా అడియో ఫంక్షన్లకు ఇప్పుడు పెద్దగా గ్లామర్ వుండడం లేదు. అయితే ఇప్పుడు బన్నీని అడియో ఫంక్షన్లకు గెస్ట్ గా లాగాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.

 బన్నీ కూడా కాస్త అందరితో ఇలా ఇంటరాక్ట్ కావాలనే చూస్తున్నారట. త్వరలో జరగబోయే రెండు అడియో ఫంక్షన్లకు బన్నీ చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. అందులో ఒకటి కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా తయారైన జయమ్ము నిశ్చయమ్మరా అడియో ఫంక్షన్. రెండవది నిఖిల్ హీరోగా తయారయిన ఎక్కడికి పోతావు చిన్నవాడా. 

ఈ రెండు సినిమాల యూనిట్లు తమ అడియో ఫంక్షన్లకు చీఫ్ గెస్ట్ గా రమ్మని రిక్వెస్ట్ చేసాయట. శ్రీనివాసరెడ్డి సినిమాకు డైరక్టర్ సుకుమార్ కూడా సపోర్ట్ గా వున్నారు కాబట్టి, బన్నీ వచ్చే అవకాశం వుంది. అలాగే నిఖిల్ కు బన్నీతో మంచి స్నేహం వుంది కాబట్టి వస్తాడేమో?

Show comments