జవాన్ కూడా ఆగస్టులోనే

సాయి ధరమ్ తేజ, మెహ్రీన్ జంటగా నటిస్తున్న జవాన్ సినిమా కూడా రిలీజ్ మంథ్ ను ఫిక్స్ చేసుకుంది. ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతోంది. అందుకే ప్రమోషన్ కు తెరతీసింది. దర్శకుడు బివిఎస్ రవి బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ వదిలారు.

టైటిల్,ట్యాగ్ లైన్ జస్టిఫై చేసేలా? మొబైల్ వాల్ పేపర్ లో ఫ్యామిలీ పిక్, ఇంటి బయట హాకీ స్టిక్ పట్టుకుని, బైక్ మీద కాపలా కలిపి, సినిమా కాన్సెప్ట్ ను చెప్పకనే చెప్పేసాయి. సాయి ధరమ్ ను మరింత మాన్లీగా, యూత్ ఫుల్ గా ప్రెజెంట్ చేసారు.

రచయిత బివిఎస్ రవి తొలిసారి డైరక్టర్ అవుతున్నారు ఈ సినిమాతో. దిల్ రాజు సిన్మాను సమర్పించడం విశేషం. సాయి ధరమ్ సరసన మెహ్రీన్ నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగతీతం అందిస్తున్నారు.

తిక్క, విన్నర్ సినిమాలు నిరాశ పర్చడంతో సాయి ధరమ్ తేజ సరైన హిట్ కోస చాలా గట్టిగా కృషి చేస్తున్నాడు. ఆ టైమ్ లో ఇలాంటి ఎమోషనల్ అంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎంచుకున్నాడు. ఎలా వుంటుందో చూడాలి.

Show comments