పచ్చమీడియాది ప్రతి రోజూ పతనావస్థే!

తెగించిన వారికి తాతల్లా తయారయ్యారు పచ్చమీడియా ఓనర్లు. తెలుగుదేశం ప్రిస్టేజిని కాపాడటంలో, బాబు ఇమేజ్ డ్యామేజ్ కాకుండా తమ పరువును పణంగా పెట్టిన ఈ మీడియా ధిగ్గజాలు ప్రతి రోజూ దిగజారుడు రాతలతో పాఠకులను విసిగిస్తున్నాయి. ప్రత్యేకించి పచ్చమీడియా పేపర్ల పుష్కర ప్రయాస అంతా ఇంతా కాదు!

ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు. ప్రజల సొమ్మును ఇంతలా ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం భావ్యమా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. పచ్చమీడియా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ ప్రచార ఆర్భాటానికి అనుగుణంగా స్టెప్పులేస్తోంది!

ఒక పేపర్లలో నేమో.. పుష్కర యాత్రికుల గురించి నంబర్లు ఏసుకుని మురిసిపోతున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 60 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారట! మరి ఈ గాలి లెక్కలకు శాస్త్రీయత ఏందంటే… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వ్యక్తుల నంబర్లను చెప్పుకొస్తారు! అంటే.. విజయవాడ ఏరియాలో ఆర్టీసీ బస్సు ఎక్కినవాళ్లంతా పుష్కర యాత్రికులే అనమాట! ఆ స్థానిక ప్రజలు ఏ పనుల మీద ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినా వాళ్లు పుష్కరాలకు వెళ్లినట్టే.. ఎన్ని బస్సులు మారితే అన్ని సార్లు పుష్కర స్నానం చేసినట్టు అనమాట!

ఎంతమంది పుష్కర స్నానాలు చేశారు.. అనేది ఏ మాత్రం ప్రాధాన్యతలేని అంశం ఇక్కడ. అయితే పచ్చమీడియా పాట్లు చూస్తేనే నవ్వొస్తుంది.

ఇక మరో పుష్కర విన్యాసం ఏమిటంటే.. కృష్ణా పుష్కరాలకు అఘోరాలు వచ్చారంటూ మొదలుపెట్టారు! మరి  అఘోరాలు అంటే వాళ్లు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే పచ్చ పేపర్లు చూడాలి! ఆ ఉత్తరాదిన జరిగే పుష్కరాల తరహా వేడుకల్లో కనిపించే వాళ్లనే అఘోరాలు అనుకొంటాం. కానీ.. నిజమైన అఘోరాలను మాత్రం పచ్చమీడియా లో చూసి తరించాల్సిందే! పగటి వేషాలు వేసుకొన్న వారిలా ఉన్న వారిని పట్టుకుని.. పుష్కరాలకు అఘోరాలొచ్చారూ అంటూ మొదలుపెట్టడం ఈ మీడియా వర్గాల దిగజారుడుకు మరో నిదర్శనం.

ఇక కృష్ణా నదిలో మునిగి చనిపోయిన ఐదుగురు యువకుల గురించిన వార్తకు ఈ పేపర్లు ఇచ్చిన ప్రాధాన్యతను చూస్తే.. అది మరో ప్రహసనం అవుతుంది. ఐదు మంది విద్యార్థులు.. పుష్కర స్నానం కోసం వెళ్లి మునిగి చనిపోతే.. వారు ఈతకు వెళ్లి చనిపోయారని రాయడంతో పాటు.. ఆ వార్తను ఎక్కడోలోపల పేజీల్లో మూలన పడేయడం.. వీరి పచ్చపతానికి మరో నిదర్శనం.

ఇసుకను అక్రమంగా తోడేయడం వల్లనే అలాంటి గుంతలు ఏర్పడ్డాయని.. కాంగ్రెస్ వాళ్లకు కూడా తెలియని ఇసుక దోపిడిని తెరపైకి తెచ్చింది తమ్ముళ్లే అని.. ఇలాంటి మరణాలన్నింటికీ అలాంటి దోపిడీనే కారణమని కృష్ణా పరివాహిక ప్రాంత స్థానికులు అంటుంటే.. పచ్చమీడియా మాత్రం ఈతకెళ్లి ఐదు గురు చనిపోయారు. అందులో అంతకు మించిన సీరియస్ నెస్ లేదన్నట్టుగా రాతలు రాస్తోంది. మొత్తానికి పచ్చ పేపర్ల పతనావస్థ కు పుల్ స్టాప్ అంటూ ఏమీ ఉండేలా లేదు!

Show comments