ఈపీసీ కి రీమేక్ రైట్స్ పంట

నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కలెక్షన్లు మూడో వారంలో కూడా బాగానే వున్న సంగతి అలా వంచితే తమిళ, కన్నడ రీమేక్ రైట్స్ నిర్మాత-దర్శకుడికి అదనపు లాభాలు అందించబోతున్నాయి. తమిళ వెర్షన్ కు 80 లక్షల వరకు ఆఫర్ వచ్చింది. అదే మొత్తానికి కాస్త తక్కువగా కన్నడ రీమేక్ రైట్స్ అడుగుతున్నారు. 

అడిగిన రేట్లకే ఇచ్చేసినా, కనీసం కోటిన్నర వరకు వచ్చేలా వుంది. ఇది నిర్మాత-దర్శకులకు సగం సగం అన్నమాట.ఇప్పటికి 18 కోట్ల వరకు వరల్డ్ వైడ్ షేర్ వచ్చింది ఈ సినిమాకు. ధృవ లాంటి భారీ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులు టైమ్ వుంది. శాటిలైట్, రీమేక్ రైట్స్, థియేటర్ వసూళ్లు అన్నీ కలిపి మొత్తానికి ఈపీసీ ఆదాయం పాతిక కోట్లకు చేరుకున్నట్లే. ఈ సినిమా నిర్మాణానికి జస్ట్ ఏడుకోట్లు మాత్రమే ఖర్చయింది. 

ఒక దశలో నిర్మాత ఆ ఖర్చుకే సినిమా బడ్జెట్ దాటిపోతోందని కాస్త భయపడ్డారు. ఆ క్రమంలోనే కర్ణాటక హక్కులు హీరో నిఖల్ కు ఇచ్చేసారు. ఇప్పుడు అదే సినిమా నిర్మాతకు కాసులు పండించింది.

Show comments