ఎలాగైనా ఇషాన్ ను హీరోగా నిలబెడతాడట

రోగ్ సినిమా అట్టర్ ఫ్లాప్. రిలీజైన 24 గంటల్లోనే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది జనాలకి. సినిమాలో ఏ ఒక్క యాంగిల్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో వరుస ఫ్లాపులతో హ్యాట్రిక్ అందుకున్నాడు పూరిజగన్నాధ్. లోఫర్, ఇజమ్, రోగ్... ఇలా మూడు ఫ్లాపులన్నమాట. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడడు పూరి. మరీ ముఖ్యంగా చేతిలో బాలయ్య సినిమా పెట్టుకొని రోగ్ గురించి అస్సలు డిస్కస్ చేయడు.

కానీ ఈసారి మాత్రం పూరి మాట్లాడాడు. ఇషాన్ తో మరో సినిమా చేస్తానంటున్నాడు పూరిజగన్నాధ్. ఎలాగైనా ఇషాన్ కు ఓ హిట్ ఇస్తానంటున్నాడు. అంటే రోగ్ ఫ్లాప్ అని ఒప్పుకున్నాడన్నమాట. రోగ్ ఫ్లాప్ అయినా ఇషాన్ పై మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. కుర్రాడు బాగా చేశాడని మెచ్చుకుంటున్నారు. అందుకే ఇషాన్ కు తొలి విజయాన్ని తానే అందిస్తానంటున్నాడు పూరి జగన్నాధ్. 

నిజానికి ఇషాన్ తో మరో సినిమా ఒప్పందం ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదట. రోగ్ సినిమా సెట్స్ పైకి రాకముందే పూరితో రెండు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకున్నాడట నిర్మాత సీఆర్ మనోహర్. సో.. ఇంకో సినిమా బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ రెండో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది.

Show comments