వినండ్రా అబ్బాయిలూ.. బాబు గురించి ఓ జర్నలిస్టు మాట!

ఈ దేశంలో జనాలకు లాజిక్కుల కన్నా మ్యాజిక్ లే ఇష్టం..  “జులాయి’’ సినిమా  కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్. ఇది అక్షర సత్యం అనడానికి  ఎన్నో రుజువుల్లో ఇదీ ఒకటి! లేకపోతే ప్రతిపక్షాల వాళ్లు కాదు, వైఎస్ భక్తులు కాదు, బాబు అంటే పడని వారూ కాదు.. ఎప్పుడో పదకొండేళ్ల కిందటే బాబు గారి పాలన గురించి అధ్యయనం చేసి ఒక నిఖార్సైన జర్నలిస్టు చెప్పిన మాటను విన్నది ఎంతమంది? అదే బాబు గారు చెప్పే అభూత కల్పనలు, ఆయన భజంత్రీ మీడియా రాసే దివాళా కోరు రాతలకు ఉన్నంత ప్రచారం, బాబు గారి పాలన గురించి ఉన్నఅబద్దాలకు, భ్రమలకు  ఉన్నంత ప్రచారం.. ఆయన జమానాలోని వాస్తవ గణాంకాలకు లేకపోవడం ఏమిటి!

తమ స్వార్థం కోసం పచ్చపత్రికలు రాసే విషపూరిత, స్వార్థపూరిత కథనాలను నమ్మేసే జనాలు.. నిస్వార్థంగా ఒక పరీశీలకుడు, సీనియర్ జర్నలిస్టు, అందునా విశ్వసనీయతకు మారు పేరైన “ది హిందూ’’ జర్నలిస్టు, ఆ పేపర్లో ప్రత్యేకించి గ్రామీణ వార్తల వెటరన్ రిపోర్టర్ గా పేర్గాంచిన వ్యక్తి మాటలను పట్టించుకోకపోవడం ఏమిటి?

ఈ తరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కూడా.. చంద్రబాబు వల్లనే హైదరాబాద్ లో ఐటీ డెవలప్ అయ్యింది అనే మాటను మాట్లాడుతున్నప్పుడు వారి వెర్రి తనంపై కలిగే జాలి  అంతా ఇంతా కాదు! సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ అంటే.. వారేదో మేధస్సు ను కలిగి ఉంటారను భ్రమలను తొలగిస్తుంది వారి నుంచి వినిపించే పై అభిప్రాయం.

 ఆ రంగంలో రాణించే వాళ్ల బుర్రలకు పదునెక్కువ అనే అభిప్రాయం ఏదైనా ఉంటే.. అది కాస్తా ఎంచక్కా తొలగించుకోవచ్చు! తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  హైదరాబాద్ లో ఐటీ నావల్ల నే అభివృద్ధి అయ్యిదంటూ ఏక వాక్య సుత్తిని పదే పదే భజాయించినా అందులో ఆయన మేధస్సు ఉంది. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజమని అనేక మందిని భ్రమింపజేయవచ్చు అనే హిట్లర్ అనుచరుడు గొబెల్స్ థియరీని బాబు అమలు పరుస్తున్నాడని అనుకోవచ్చు. ఎటొచ్చీ ఈ మీడిమేలపు సాఫ్ట్ వేర్ బ్రహ్మీలూ అదే మాట మాట్లాడినప్పుడు… మట్టి బుర్రలతో కూడా ఆ రంగంలో రాణించవచ్చు.. అనే స్థిరాభిప్రాయం కలుగుతుంది. Readmore!

ఆంధ్రప్రదేశ్ లో 1995 నుంచి 2004ల మధ్య సాగిన బాబుగారి పాలన అనే అంకం ముగిసిన తర్వాత.. ఆయన హయాంలో జరిగిన “అభివృద్ది’’ గురించి, దాని గురించి చంద్రబాబు చెప్పుకునే అబద్ధాల గురించి పాలగుమ్మి సాయినాథ్ పరిశీలన ఈ వీడియోలో ఉంది.  

Click Here For Video

-జీవన్ రెడ్డి.బి 

Show comments

Related Stories :