ఇక ఇదో హడావుడి మొదలు

మనవాళ్లకి ఏదో ఒకటి వుండాలి. వాట్సప్, ఫేస్ బుక్ లలో చలామణీ చేసుకునేందుకు. జ్యోతిష్యుడు శ్రీనివాస గార్గేయ అలాంటి చర్చకు ఇప్పుడు ఒక ఐటమ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 27న మౌని అమావాస్య చాలా క్లిష్టమైనదని, పరిహారం కోసం ఆ రోజు అందరూ మౌనం పాటించాలని పొన్నలూరి శ్రీనివాస గార్గేయ తెలిపారు. 

ఆదివారం ఆయన విశాఖలో విలేకరుల తో మాట్లాడుతూ, ఏటా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారన్నారు. 2017 జనవరి 27న రానున్న మౌని అమావాస్య, చాలా సమస్యలతో కూడిందని పేర్కొన్నారు. 

దానికి పరిహారం కోసం ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలని సూచించారు. అంతసేపు మాట్లాడకుండా ఉండలేని వారు ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా తప్పకుండా మౌనంగా ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో మాట్లాడితే గ్రహాల ప్రభావం వల్ల మరుసటి రోజు నుంచే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు.

ఇంకేముంది, ఇప్పటికే దీనిపై వాట్సప్, ఫేస్ బుక్ లలో దీనిపై మోత మోగిపోతున్నాయి!

Show comments