యూ..టూ..అభినేత్రీ?

దసరా ముసురు అని నానుడి. దసరాకు విడుదలవుతున్న సినిమాలను చుస్తుంటే ఈ నానుడే గుర్తుకు వస్తోంది. ఇప్పటికే జాగ్వార్, ప్రేమమ్, వీడు గోల్ఢ్ ఎహె, మా ఊరి రామాయణం జాబితాలో రుమాళ్లు వేసుకుని కూర్చున్నాయి. ఇప్పుడు వీటి సరసన అభినేత్రి కూడా చేరిపోయింది. అంటే టోటల్ గా అయిదు పెద్ద సినిమాలు అన్నమాట. 

తమన్నా, ప్రభుదేవా, సప్తగిరి లాంటి వాళ్లంతా నటించిన అభినేత్రి మూడు భాషల్లో ముస్తాబయింది. తెలుగులో ఎంవివి సత్యనారాయణ, హిందీలో సోనూ సూద్ నిర్మాతలు. చాన్నాళ్ల తరువాత ప్రభుదేవా తెలుగులో నటించడం, హర్రర్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కావడంతో ఈ సినిమా మీద మంచి బజ్ వుంది. 

క్లాస్ టచ్ తో వుండే ప్రేమమ్, మాస్ ఎంటర్ టైన్ మెంట్ అయిన వీడు గోల్డ్ ఎహె, డిఫరెంట్ ప్రయోగంతో కూడిన మా ఊరి రామాయణం, హర్రర్ ఎంటర్ టైనర్ అభినేత్రి వీటన్నింటితో డబ్బులతో పబ్లిసిటీ కుమ్మేస్తున్న జాగ్వార్ పోటీ పడుతుందన్నమాట.  మొత్తానికి దసరా హడావుడి టాలీవుడ్ కు బాగానే వుంది.

Show comments