హీరోయిన్లు కావలెను

తెలుగునాట సినిమాలకు కొదవలేదు.హీరోలకు కొదవలేదు. ప్రాజెక్టులకు లెక్కే లేదు. కానీ అన్నింటికీ కామన్ సమస్య హీరోయిన్ దొరక్క పోవడమే. చాలా ప్రాజెక్టులు హీరోయిన్లు సెట్ కాక ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్య ఒక హీరోకి కాదు, అందరు హీరోలకూ అదే సమస్య.

విక్రమ్ కుమార్-అఖిల్ కాంబినేషన్ లో సినిమా మొదలైంది. యాక్షన్ ఎపిసోడ్ లు తీసారు. అక్కడితో ఆగింది. హీరోయిన్ కావాలి.

ప్రభాస్ సాహో సినిమా మొదలైంది. హీరోయిన్ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఎవర్ని టచ్ చేసినా, డేట్ లు ఎప్పడో ఏడాది తరువాత అంటున్నారు. అనుష్కతోనే ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.

వచ్చే నెలలో నాగ్ చైతన్య-చందు మొండేటి సినిమా స్టార్ట్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ అనుకున్నా డేట్ లు సెట్ కావడం లేదు. వేరే ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు.

బన్నీ-వక్కంతం వంశీ సినిమాకు అదే సమస్య. ఇప్పటకి ముగ్గురు నలుగురు హీరోయిన్ల పేర్లు డిస్కషన్ కు వచ్చాయి. ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. చాలా చిన్న వయసు వున్న అమ్మాయి కోసం చూస్తున్నారని వినికిడి.

ఇక టాప్ హీరోలు మహేష్ (కొరటాల శివ), పవన్ కళ్యాణ్ (సంతోష్ శ్రీనివాస్) ప్రాజెక్టులకు హీరోయిన్ ల వేట స్టార్ట్ అయింది.

ఇదిలా వుంటే హీరో రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రేడీ అయిపోయింది. ఆమెను చూస్తే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అనుకునేలా మేకోవర్ అయింది. రెండు తమిళ ప్రాజెక్టులను ఓకే చేసే డిస్కషన్లు నడుస్తున్నాయి. కానీ మన జనాల దృష్టి మాత్రం ఇంకా ఆ అమ్మాయి మీద పడినట్లు లేదు.

Show comments