వీళ్లూ దర్శకులే సార్

దర్శకుడు అని టైటిల్ పెట్టి మరీ సినిమా నిర్మిస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రిబ్యూట్ టు డైరక్టర్స్ అంటూ ఓ పోస్టర్ డిజైన్ చేసి వదిలారు.

ఎల్ వి ప్రసాద్, కేవి రెడ్డి, బాపు, విశ్వనాధ్, దాసరి, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, కోదండరామిరెడ్టి, ఆ తరువాత ఈ జనరేషన్ జనాల ఫోటోలు ఇందులో చేర్చారు.  బాగానే వుంది. ఓ దర్శకుడిగా సీనియర్ దర్శకులందరినీ స్మరించుకోవడం. కానీ ఒకటే బాగాలేదు.

తమిళ దర్శకుల చిత్రాలు కూడా చేర్చిన సుకుమార్ కొందరు మంచి తెలుగు దర్శకుల చిత్రాలు కూడా విస్మరించడం ఏమిటో? కమలాకర కామేశ్వర రావు. అనేకానేక పౌరాణిక చిత్రాలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానుభావుడు, విఠలాచార్య కర్ణాటక నుంచి తెలుగునాడుకు వచ్చి, తెలుగు ప్రేక్షకుడి నాడి పట్టి, అట్టడుగు ప్రేక్షకుడి ఆహ్లాదానికి సరిపడే సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నవాడు.

ఆదుర్తి సుబ్బారావు, తెలుగులో సాంఘిక కమర్షియల్ చిత్రాలకు, కొత్తవాళ్లతో ప్రయోగాలకు నాంది పలికినవాడు, కేఎస్ ప్రకాశరావు నవలా చిత్రాలకు పెట్టింది పేరు, ప్రేమనగర్ దర్శకుడు , ఇక రామచంద్రరావ్ తెలుగులో భారీ చిత్రాలకు, ప్రయోగాలకు ఒరవడి పెట్టినవాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడు చేసిన మనుషులు, పసివాడి ప్రాణం వంటి విభిన్న సినిమాలు చేసినవాడు., వీళ్ల నలుగురి చిత్రాలు ఎందుకు చేర్చలేకపోయినట్లో? విస్మరించినట్లో ? Readmore!

Show comments