చరణ్ ఫ్యామిలీకి నచ్చలేదట?

టాలీవుడ్ లో లేటెస్ట్ లక్కీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను రామ్ చరణ్ సినిమా నుంచి తప్పించడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆది నుంచీ ఈ విషయం వార్తల్లోనే వుంటోంది. రెమ్యూనిరేషన్ దగ్గర డిస్కషన్లు జరుగుతున్నాయని ఆదిలో వార్తలు వినిపించాయి. ఆ తరువాత హీరోయిన్ గా అనుపమ ఫిక్స్ అయిందని వార్తలు వెలువడ్డాయి. అంటే రెమ్యూనిరేషన్ తకరారు సెట్ అయిందన్నమాట అని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ అంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి అనుపమను తప్పించారని వార్తలు వెలువడ్డాయి. సో, రెమ్యూనిరేషన గొడవ సెట్ కాలేదన్నమాట అన్నది ఫిక్స్ అయింది. కానీ రెమ్యూనిరేషన్ మాత్రమే కాదు క్యారెక్టర్ ప్రకారం కాస్త ముదురుగా కనిపించే అమ్మాయి కావాలి, అనుపమ సెట్ కాలేదని ఫీల్ కావడమే ఇందుకు కారణం అని, సమంతను అందుకే ఎంపిక చేసారని వార్తలు వచ్చాయి. ఇంతలో యూనిట్ కూడా అసలు రెమ్యూనిరేషన్ సమస్య కాదని ట్వీట్ చేసింది. 

ఇదిలా వుంటే అసలు సంగతి ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రెమ్యూనిరేషన్ విషయం వాస్తవమేనట. కానీ అది సెట్ అయిపోయిందట. అయితే శతమానం భవతి విడుదలయిన తరువాత ఓ నైట్ రామ్ చరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా శతమానం భవతి సినిమాను ప్రత్యేకంగా చూసారట. అప్పుడు మెగా ఫ్యామిలీ మెంబర్స్ లో మెజారిటీ జనాలకు అనుపమ అంతగా నచ్చలేదట. వారంతా నో అన్నదానికే ఎక్కువగా ఓటు వేయడంతో ఆ విషయం రామ్ చరణ్ నిర్మాతలకు చెప్పి, హీరోయిన్ ను మార్పించారట. ఇప్పుడు అనుపమ విషయంలో టాలీవుడ్ లో లేటెస్ట్ గుసగుస ఇది. శతమానం సినిమా అనుపమకు సక్సెస్ తేవడమే కాదు, ఓ సినిమా ఆఫర్ ను పోగొట్టిందన్నమాట.

 

Readmore!
Show comments

Related Stories :