గెటప్ అదిరింది.. టైటిల్ కొత్తగా ఉంది...

ఉగాది సందర్భంగా నితిన్ కొత్త సినిమా ప్రీలుక్ విడుదల చేశారు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నితిన్ నయా మేకోవర్ ను విడుదల చేయడంతో పాటు టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు లై (LIE) అనే పేరు పెట్టారు. దీనికి ట్యాగ్ లైన్ గా లవ్, ఇంటలిజెన్స్, ఎనిమిటీ అంటూ మూడు పదాలు తగిలించారు. 

ఇక లుక్ విషయానికొస్తే నితిన్ సరికొత్తగా ఇందులో కనిపిస్తున్నాడు. ఇంత గడ్డం పెంచిన నితిన్ ను ఇంతకుముందు ఎవరూ చూడలేదు. దీనికితోడు బ్లాక్ షర్ట్, డిఫరెంట్ షేడ్స్ తో నితిన్ కంప్లీట్ మేకోవర్ కనిపిస్తోంది. ఇదే సినిమాలో ఇంతకుముందు ఖైదీ గెటప్ లో కూడా కనిపించాడు నితిన్. 

అ..ఆ లాంటి భారీ విజయం తర్వాత నితిన్ చేస్తున్న సినిమా కావడంతో లై మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు కృష్ణగాడి వీరప్రేమగాథ లాంటి సక్సెస్ తర్వాత హను డైరక్ట్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ ఇంకాస్త పెరిగింది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో నితిన్ సై అనే సినిమా చేశాడు. ఇప్పుడు లై అనే సినిమాతో మనముందుకొస్తున్నాడు.

Show comments