అశ్లీలత లేకుండా చెన్నయ్ చైత్రమా

కమల్ కల్యాణ్ మూవీ మేకర్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అక్షయ్ కూరపాటి, దివ్య, ప్రవళ్లిక పద్రాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "చెన్నయ్ చైత్రమా ".కమల్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలొ ఈ సినిమా తెరకెక్కుతొంది. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా టైటిల్ లొగొ లాంఛ్ జరిగింది.

నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మల్ల పల్లి రామ సత్యనారాయణ టైటిల్ లొగొను ఆవిష్కరించారు. హీరొలు సూర్య శ్రీనివాస్ , అక్షయ్  మాట్లాడుతూ.. ఓ మంచి లవ్ స్టోరీ చెస్తున్నాము. నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా చిత్రముంటుందన్నారు.

హీరొయిన్ దివ్య,  ప్రవల్లిక మాట్లాడుతూ.. టైటిల్ నుంచి,  ప్రతి పాత్ర వరకు దర్శకుడు కల్యాణ్ సూబర్బ్ గా డిజైన్ చెశారు. ఈ సినిమా లొ మేము భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.

దర్శక నిర్మాత  కమల్ కల్యాణ్ మాట్లాడుతూ  మన దగ్గర ఉన్నదాంతో మనం సంతృప్తి పొందాలన్న కాన్సెప్ట్ తో "చెన్నయ్ చైత్రమా " రూపొందుతుంది. ఎక్కడ చిన్నపాటి అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలిసి చూసెలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.

Show comments