బాలీవుడ్‌లో ఈ మధ్య 'అడల్ట్ కంటెంట్' సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. మరీ అంతలా కాకపోయినా, ఆ స్థాయిలో వుంటుంటాయి పూరి సినిమాలు కూడా. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించడంలో పూరి తర్వాతే ఎవరైనా. ఆ రొమాన్స్ కూడా చాలా వైల్డ్‌గా అన్పిస్తుంటుంది. 'టెంపర్' సినిమాలో 'క్రాసింగ్' డైలాగ్, 'బిజినెస్‌మేన్' సినిమాలో 'ముంబైని .... పోయించడానికి..' అనే డైలాగ్స్ అప్పట్లో పెద్ద వివాదానికే తావిచ్చాయి. ఇక సీన్స్ సంగతి సరేసరి.. అల్ట్రా హాట్‌నెస్ పూరికి అలవాటే.
ఇక, పూరి తన తాజా చిత్రం 'రోగ్' సినిమాలోనూ ఆ అల్ట్రా హాట్‌నెస్‌నే ఫాలో అయినట్లున్నాడు. హీరో మీదకి హీరోయిన్ ఎక్కేయడం 'ట్రైలర్‌లోనే' పలుసార్లు కన్పించింది. హీరోయిన్ బ్యాక్ పార్ట్ మీద చెయ్యివేయడం.. హీరోయిన్ లిప్స్ హీరో జుర్రేసేయత్నం.. ఇవన్నీ వున్నాయి ట్రైలర్ లో. ఇవి 'ప్రేమ'కి సంకేతమా.? అనడక్కండి.. అదంతే. బాలీవుడ్‌లో సన్నీలియోన్ సినిమాల తరహాలో సినిమా వుంటుందా.? అన్న అనుమానాలకు తావిచ్చింది. మనారా చోప్రా, కొత్త భామ ఏంజెలా.. వెండితెరపై యధేచ్ఛగా అందాలు ఆరబోసేశారు.
అన్నట్టు, యాక్షన్ ఎపిసోడ్స్, పూరి మార్క్ హీరోయిజం.. ఇవన్నీ టీజర్‌లో కన్పించాయి. 'రోగ్' అనే టైటిల్ పెట్టాక, ఈ మాత్రం 'వైల్డ్‌నెస్' వుండకపోతే ఎలా.. అనుకున్నాడేమో, ఆ వైల్డ్‌నెస్ అనేది యాక్షన్ సీక్వెన్సెస్‌లోకన్నా రొమాన్స్‌లోనే ఎక్కువగా చూపించేశాడు. ట్రైలర్ ఇలా వుంటే, సినిమా మొత్తం ఇంకెలా వుంటుందో ఏమో.!