నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌బాబు ఎమ్మెల్సీ కోసం నామినేషన్ వేసిన సందర్భంలో ఏపీఎన్నార్టీ అభినందనలు తెలిపింది. టీడీపీ జాతీయ నాయకుడి హోదాలో తొలిసారిబరిలోకి దిగబోతున్న నారా వారి వారసుడి నామినేషన్ ఘట్టం అట్టహాసంగా పార్టీ శ్రేణులు జరిపాయి. ఈ నేపథ్యంలో ఏపీఎన్నార్టీ చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ సొసైటీ తరఫున లోకేష్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ లోకేష్ కు ఏపీఎన్నార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమంలో తాము భాగస్వాములవుతామని వెల్లడించారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవి చేపట్టబోతుండటం ఆనందంగా ఉందన్నారు.
లోకేష్ ను అభినందించిన ఏపీఎన్నార్టీ
Show comments