మహేష్ డీల్ ఫైనల్

మహేష్-మురగదాస్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా శాటిలైట్ డీల్ ఫైనల్ అయింది. ఆ సినిమా తెలుగు-హిందీ వెర్షన్ల శాటిలైట్ హక్కులు 26 కోట్లకు జీ టీవీ తీసుకుంది. ఈ మేరకు నిన్నటికి నిన్న అగ్రిమెంట్ సంతకాలు జరిగిపోయాయి.

ఈ శాటిలైట్ బేరం దాదాపు నెల రోజులుగా సాగుతొంది. ముఫై దగ్గర సెటిల్ అవుతుందనుకున్నారు, ఆఖరికి 26 దగ్గర ఫిక్స్ అయింది. ఈ సినిమాకు సంబంధించి తొలి సేల్ ఇదే. ఇంకా మరే హక్కులు ఇంకా సేల్ స్టార్ట్ చేయలేదు.

ఇదిలా వుంటే ఈ సినిమా షూట్ ప్రారంభించి 60 రోజలుు అయింది. ప్రస్తుతం అహమ్మదాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 23 వరకు ఇక్కడే షూటింగ్ వుంటుంది.

ఈ సినిమాకు దాదాపు అరడజను పేర్లు షార్ట్ లిస్ట్ చేసారు. మరో వారం, పది రోజుల్లో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం వుంది.

Readmore!

Show comments