మేలు అంటే నమ్మేదెలా మెగాస్టారూ?

సినిమా వాళ్లు భలే జోక్ లు వేస్తారు. మెగా క్యాంప్ ఇవ్వాళ అలాంటి జోక్ నే వేసింది. 11న ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల చేయడం అన్నది బాలకృష్ణ మేలు కోసమే అన్నంత కలరింగ్ ఇస్తోంది. చిరంజీవి స్వయంగా రామ్ చరణ్ ను సినిమా 12న బాలయ్య సినిమాపై వేయకుండా, 11న వేయమని ఆదేశించారని, ఇదంతా బాలకృష్ణ కోసమే అని ప్రచారం చేయాలని తహతహ లాడుతున్నారు. 

కానీ ఇదంతా నమ్మేదెవరు? ?ఖైదీ 11న వచ్చినా, 12న వచ్చినా బాలయ్య సినిమాకు వచ్చే తేడా ఏమీ వుండదు. ఎందుకంటే 12న బాలయ్య సినిమా విడుదల టైమ్ కు ఖైదీ థియేటర్లలో వుంటుంది. అంటే పోటీ వున్నట్లే. కానీ చిరు సినిమాకు 11న పోటీ వుండదు. ఫస్ట్ డే రికార్డు వుంటుంది. ఇది బాలయ్యకు సాధ్యం కాదు. నిజంగా బాలయ్యకు మేలు చేయాలనే ఉద్దేశమే చిరంజీవికి వుంటే తన సినిమాను 11న కాకుండా 13న ఫిక్స్ చేసేవారు. అప్పుడు బాలయ్యకు ఓ రోజు సోలో కలెక్షన్లు దక్కేవి. ఇప్పుడు ఖైదీకి సోలో కలెక్షన్లు వుంటాయి కానీ, శాతకర్ణికి కాదు. 
ఇలా తెలివిగా వ్యవహరించి, బాలయ్య కోసమే ఇదంతా చిరంజీవి చేసారని కలర్ ఇవ్వడానికి ప్రయత్నించడం ఏమిటో? మెగా క్యాంప్ తెలివితేటలు కాకపోతే.

Readmore!
Show comments