పూరిజగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న సినిమాలో ఈ మధ్యే శ్రియను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ న్యూస్ ఇంకా జనాల్లో పూర్తిస్థాయిలో రిజిస్టర్ కాకముందే అప్పుడే బాలయ్య కొత్త సినిమా కోసం హీరోయిన్ల వేట మొదలైంది. ఇది బాలకృష్ణ 102వ సినిమాకు సంబంధించిన మేటర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో జులై 10 నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య సరసన తమన్న, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉంది. బాలయ్యతో ఓ సినిమా చేయాలనుందని తమన్న ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు సినిమాలు కూడా ఏమీలేవు. సో.. బాలయ్య సినిమాకు ఆమె కాల్షీట్లు కేటాయించడానికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.
ఇక సెకెండ్ హీరోయిన్ గా ప్రగ్యా జైశ్వాల్ ను అనుకుంటున్నారట. ఆమె కూడా స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పటివరకు బిగ్ లీగ్ లోకి ఎంటర్ కాలేదు. కాకపోతే వీళ్లకు వచ్చే చిక్కంతా ఒక్కటే. ఒక్కసారి బాలయ్య సరసన నటిస్తే కుర్రహీరోలు తమను మళ్లీ కన్సిడర్ చేస్తారా అనే సందేహం మాత్రం వీళ్లను పట్టిపీడిస్తోంది. వీళ్లకే కాదు, ఏ హీరోయిన్ కైనా ఆ సందేహం సహజం. అవన్నీ ఆలోచించిన తర్వాతే బాలయ్య సినిమాకు సైన్ చేయాలి మరి.