బాలయ్యకు పూరి షాక్

ఓం ప్రథమంగానే హీరో బాలకృష్ణ సినిమాకు దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ షాక్ ఇచ్చారు. నిర్మాతకు, యూనిట్ కు తెలియకుండానే ట్విట్టర్ లో ఆయన బాలకృష్ణతో తను చేయబోయే సినిమాకు నూతన నటీనటులు కావాలంటే ప్రకటన ఇచ్చేసారు. ఈ ప్రకటన చూస్తుంటే మొత్తం బాలయ్య సినిమాను పూరి కొత్తవాళ్లతో నింపేసేటట్లు కనిపిస్తోంది. 

సాధారణంగా పెద్ద హీరోలు అంటే వారి రేంజ్ కు తగిన నటులను ఎక్కడెక్కడి నుంచో ఏరి మరీ తెస్తారు. కానీ అలాంటిది పూరి ఇద్దరు హీరోయిన్లు, ఓ విలన్, ఓ యంగ్ పెయిర్ వీరు కాక ఇంకా అదనపు నటులు అందరూ కావాలంటూ ప్రకటన ఇచ్చేసారు. కావాల్సిన క్వాలిటీలు కూడా డిటైల్డ్ గా ఇచ్చేసారు.

ప్రధాన విలన్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు విలన్లు వుండేలా వుంది సినిమాలో ఈ ప్రకటన చూస్తుంటే. అలాగే ఓ రాజకీయ నాయకుడి పాత్ర ధారి కూడా. 

ఇదిలా వుంటే ఇద్దరు హీరోయిన్లు వుండడం వరకు ఓకె కానీ ఓ యంగ్ కుర్రాడు ఆరు అడుగుల పొడగరి కావాలని అనడం ఏమిటో? బాలయ్య పక్కన ఓ యంగ్ పెయిర్ పెడితే ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో? మొత్తానికి బాలయ్య సినిమాను పూరి ఏదో చేసేటట్లే వున్నాడు. Readmore!

ఇదిలా వుంటే పూరి జగన్నాథ్ కొత్తగా పెట్టిన కాస్టింగ్ సంస్థను బలోపేతం చేసుకుని, యంగ్ టాలెంట్ ను తన సంస్థతో అగ్రిమెంట్ చేయించుకునే దిశగా బాలయ్య సినిమాను వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. చార్మీ సిఇఓగా వున్న ఈ సంస్థకు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం రావాలంటే, వాళ్ల దగ్గర బోలెడు మంది నటులు వుండాలి. అందుకే ఈ సినిమాను వాడుకుని, కొత్త నటులను రప్పించుకుని, అగ్రిమెంట్ చేసుకునే వ్యూహం పన్నినట్లుంది పూరి.

Show comments