ఇజమ్ తరువాత ఏ సినిమా చేయాలన్నదానిపై హీరో కళ్యాణ్ రామ్ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. డైరక్టర్ నాగేశ్వర రెడ్టితో ఓ మాంచి కామెడీ ఎంటర్ టైనర్ చేయాలా అని ఆలోచించారు. కానీ ఒక్కో సినిమాకు నాగేశ్వర రెడ్డి ఫ్లాపుల జాబితా పెరుగుతోంది. దాంతో ఆయన పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇంతలో డైరక్టర్ పవన్ సాధినేని ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ తేవడంతో ఇప్పుడు అటు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నారా రోహిత్ తో సావిత్రి సినిమా అందించిన పవన్ సాధినేని తయారు చేసిన స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. వన్స్ స్క్రిప్ట్ లాక్ అయిపోతే ఈ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం వుంది.
అయితే ఎన్టీఆర్ హీరోగా తాను నిర్మాతగా సినిమా చేసే పనిలో కళ్యాణ్ రామ్ వున్నారు. మరి ఆ సినిమాతో పాటు ఈ సినిమాను నిర్మించే అవకాశం వుంటుందా అని అనుమానం. అందువల్ల ఆ సినిమా అయిన తరువాతనో, లేదా ఆ సినిమా ఓ కొలిక్కి వచ్చాకనో కళ్యాణ్ రామ్ సినిమా వుండొచ్చు.