మెగా ఫ్యామిలీకి వర్మ క్షమాపణ

'నరేంద్రమోడీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ దాకా అందరి మీదా కామెంట్స్‌ చేస్తుంటాను.. ఒక్కోసారి నా మీద నేను కూడా కామెంట్స్‌ చేసుకుంటుంటాను. మీ ఫ్యామిలీ మీదనే కాదు. నాగబాబుగారూ మీరంటే నాకు చాలా ఇష్టం. నా ఉద్దేశ్యం వేరే అయినా మీరు హర్ట్‌ అయ్యారు కనుక, చిరంజీవిగారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి..' 

- ఇదీ నాగేంద్రబాబు ఆగ్రహానికి వర్మ దిగొచ్చి క్షమాపణ చెప్పిన వైనం. 

'ఖైదీ నెంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నాగబాబు, 'ఓ సినీ ప్రముఖుడు..' అంటూ పరోక్షంగా రామ్‌గోపాల్‌ వర్మని కడిగి పారేసిన విషయం విదితమే. 'అక్కుపక్షి.. పనికిమాలిన..' అంటూ నాగబాబు మాటలు తూలేశారు కూడా. ఇలాంటి వేదికలపైనుంచి.. ఈ స్థాయిలో నాగబాబు విమర్శలు చేయడమేంటి.? అని అంతా షాక్‌కి గురయ్యారు. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో వర్మ, ఇంకా ఎక్కువగా రెచ్చిపోవాలి. కానీ, అనూహ్యంగా వర్మ క్షమాపణ చెప్పేశారు. 

ఈ మధ్యకాలంలో అని కాదు.. చాలాకాలంగా వర్మ, మెగా ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తుండడం చూస్తూనే వున్నాం. సినిమా టైటిల్‌ దగ్గర్నుంచి, గెటప్‌ దాకా.. అటు పవన్‌కళ్యాణ్‌, ఇటు చిరంజీవిపై వర్మ సెటైర్లు వేస్తూనే వున్నారు. ఇప్పటికి ఇలా, వర్మకి కౌంటర్‌ ఎదురయ్యేసరికి.. వర్మ క్షమాపణ చెప్పేశారనుకోవాలి. ఎలాగైతేనేం మెగా వర్సెస్‌ వర్మ.. ఈ 'వైరం' ఇక్కడితో ఆగిపోయినట్లేనా.? ఏమో మరి, వర్మ మాట మీద నిలబడడు కదా.!

Show comments