కేథరిన్ కు బన్నీ సిఫార్సు?

కేథరిన్ థెరిస్సా...యువ్వార్ మై ఎమ్మెల్యే అంటూ బన్నీ వెంటపడిన అమ్మాయి. ఓ సిన్మా చేస్తే ఫ్లాప్ పలకరించినా, మళ్లీ మరో సినిమా చేసాడు అదే హీరోయిన్ తో బన్నీ. సాధారణంగా ఫ్లాప్ పలకరించిన హీరోయిన్ తో మళ్లీ సినిమా చేయడం అంటే ఆలోచిస్తారు. అలాంటిది బన్నీ మాత్రం  సరైనోడులో యంగ్ ఎమ్మెల్యే పాత్రకు కేథరిన్ సరైన ఛాయిస్ అని డిసైడ్ అయి, ఆ సినిమా చేసాడు. సూపర్ హిట్ కొట్టేసాడు. 

అదే కేథరిన్ ను బన్నీ ఇప్పుడు రానా సినిమాకు కూడా సూచించాడని టాలీవుడ్ టాక్. బన్నీ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైనా రానా దర్శకుడు తేజ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. కాజల్ హీరోయిన్. అందులో మరో హీరోయిన్ కు కూడా చాన్స్ వుంది. కేథరిన్ అయితే మంచి పెయిర్ అవుతుందని బన్నీ జస్ట్ కాజువల్ రికమెండ్ చేసారని తెలుస్తోంది. 

రానా మంచి హెయిట్. కేథరిన్ కూడా రానా పక్కన జోడీగా బాగానే వుంటుంది. సో బన్నీ మంచి పెయిర్ నే సెట్ చేసాడన్నమాట.

Show comments