ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చిన మహేష్ మూవీ

సినిమా ప్రారంభమై దాదాపు 7 నెలలైంది. సెట్స్ పైకి రావడానికి మాత్రం ఇంత టైం పట్టింది. మొత్తానికి మహేష్-కొరటాల సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. “భరత్ అనే నేను” అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

సినిమా సెట్స్ పైకి వచ్చినా మహేష్ మాత్రం షూట్ లో జాయిన్ అవ్వలేదు. మహేష్ ఇంకా స్పైడర్ సినిమా పనిమీదే ఉన్నాడు. స్పైడర్ కు సంబంధించి చెన్నైలో ఆఖరి షెడ్యూల్ కొనసాగుతోంది. దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి, వచ్చేనెల నుంచి కొరటాల శివ సినిమాలో జాయిన్ అవుతాడు మహేష్. నిజానికి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను మహేష్ తో లండన్ లో ప్లాన్ చేశారు. కానీ స్పైడర్ మూవీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో.. ఆ షెడ్యూల్ ను కాన్సిల్ చేశారు.

“భరత్ అనే నేను” సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాణిని హీరోయిన్ గా సెలక్ట్ చేశారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు ఇప్పటికే కొన్ని ట్యూన్స్ అందించాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 11న సినిమాను విడుదల చేస్తారు.

Show comments