కాటమరాయుడికీ ఐటమ్ సాంగ్

ఇద్దరో, నలుగురో తమ్ముళ్లకు (మాతృకలో అయితే అంతకన్నా ఎక్కువ మందే) అన్న అయినా, పెళ్లి చేసుకోని మిడిల్ ఏజ్డ్ హీరో క్యారెక్టర్ ప్రధానాంశంగా తయారవుతున్నా, కాటమ రాయుడి సినిమాలో కూడా అయిటమ్ సాంగ్ వుంటుందట. ఈ సాంగ్ కు ఎవరైతే సూటబుల్ అన్నదే ఇప్పుడు యూనిట్ లో డిస్కషన్ పాయింట్ గా వుందట. 

కాజల్ ఇప్పటికే ఓ అయిటమ్ సాంగ్ చేసింది, తమన్నా మూడు పాటలు ఫినిష్ చేసింది. మరి ఎవరు? ఇన్నాళ్లు పవన్ సినిమా అంటే బాంబే ఐటమ్ బాంబ్ లను తేవడం అలవాటు. అత్తారింటికి దారేది దానికి మినహాయింపు అనుకోండి. అందుకే ఈ సారి కూడా దక్షిణాది హీరోయిన్ లలోనే ఎవర్నో ఒకర్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. 

కానీ యంగ్ హీరోయిన్లు ఎవరూ, ఎంత పవన్ సినిమా అన్నా ఐటమ్ అంటే ఓకె అనకపోవచ్చు. టాలీవుడ్ లో ఓ రౌండ్ కొట్టేసిన హీరోయిన్లే ఓకె అనాలి. మరి ఎవరిపై పవన్ దృష్టి పడుతుందో? ఎవరు ఓకె అంటారో చూడాలి. అయినా సినిమా షూట్ ఇప్పుడే కదా అనేక బాలారిష్టాల మధ్య స్టార్ట్ అయింది. ఓ దారిలో పడ్డాక, అప్పుడు కదా అయిటమ్ సంగతి. ఆలోగా ఎవరో ఒకరు దొరక్క పోతారా?

Show comments