సాయిపల్లవికి ఫిదా కావాల్సిందే

ప్రేమమ్ మలయాళ వెర్షన్ చూసిన వారు సాయి పల్లవిని అంత తొందరగా మర్చిపోలేరు. ఆ సినిమాలో మలారే పాటను కానీ, ఆ పాటలో ఆమె హావ భావాలను కానీ అస్సలు మరిచిపోలేరు. ప్రేమమ్ తెలుగు వెర్షన్ తొలి పాట విడుదల చేసినపుడు నెటిజన్లు సాయిపల్లవిని గుర్తు చేసుకుని, చేసిన హడావుడి ఇంతా అంతా కాదు. కానీ ఎందుకో మనవాళ్లు సాయిపల్లవిని వెంటనే తెలుగులోకి తీసుకురాలేదు. 

సెన్సిటివ్ డైరక్టర్ శేఖర్ కమ్ముల ఇప్పుడు ఆ పనికి దిగారు. వరుణ్ తేజ హీరోగా తను చేస్తున్న దిల్ రాజు సినిమాలో సాయి పల్లవే హీరోయిన్. ఆమె బర్త్ డే సందర్భంగా సాయి పల్లవి స్టిల్ తో మోషన్ పోస్టర్ వదిలారు. సాయి పల్లవికి కీలకమైన ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ఇందులో లేవు కానీ, ఆమె స్లిమ్ స్ట్రక్చర్, విల్లులా శరీరాన్ని వంచిన ఫోజు వున్నాయి. అవి చాలు జనాలు సాయి పల్లవికి ఫిదా అయిపోవడానికి.

Show comments