నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా నటిస్తున్న తొలి సినిమా 'ఒక మనసు' విడుదలకు సిద్ధమయ్యింది. సినిమా ప్రమోషన్ని బీభత్సంగా చేసేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తొలి హీరోయిన్ కావడంతో నిహారిక సినిమాపై విపరీతమైన ఫోకస్ ఏర్పడింది. నాగశౌర్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నా, అతని మీద ఫోకస్ తక్కువగానే వుంది.
ఇక, సినిమా ప్రమోషన్లో ఇటు నాగశౌర్య, నిహారిక బిజీ బిజీగా వున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో నాగశౌర్య, నిహారిక యాటిట్యూడ్నీ, పెర్ఫామెన్స్నీ ఓ రేంజ్లో పొగిడేస్తున్నాడు. అంతేనా, నిహారికకి ఇంత మంచి క్యారెక్టర్ బహుశా ఇంకెవరూ రాయలేరని తేల్చి చెప్పేశాడు. ఇది కాస్త ఓవర్గా లేదూ.?
ఇంకా నిహారికకి ఇదే తొలి సినిమా. ఏమో, భవిష్యత్తులో ఆమె నటిగా కొనసాగాలనుకుంటోందా.? లేదా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అయినప్పటికీ, ఇంతకన్నా మంచి పాత్ర దక్కదని నాగశౌర్య సర్టిఫై చేయడం ఏమంత సమంజసంగా లేదనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. సినిమా మీద, ఆ చిత్ర యూనిట్కి నమ్మకముండడం సహజమే. కానీ, ఇంతలా మెగా హీరోయిన్ని మోసేయడమేంటో.! పైగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవంతో ఈ మాట చెబుతున్నానని నాగశౌర్య చెప్పడం విశేషం.
ఎలాగూ రేపు సినిమా విడుదల కానుంది గనుక, సినిమాలో నిహారిక పాత్ర గొప్పతనం, ఆ పాత్రలో ఆమె నటనా ప్రతిభను చాటుకున్న వైనం గురించి కంప్లీట్ రిపోర్ట్ వచ్చేయనుంది. చూద్దాం.. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవాన్ని రంగరించి నాగశౌర్య నిజమే చెబుతున్నాడా.? లేదంటే మెగా హీరోయిన్ మెప్పు కోసం పాకులాడుతున్నాడా.? అన్న ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది కదా.!