సినిమాలకు వర్షాల దెబ్బ

ఆంధ్ర కోస్తా మొత్తం వర్షాలు చితక్కొట్టేస్తున్నాయి. గడచిన వారం రోజులుగా ఉత్తర కోస్తాను వర్షాలు ఊపుతున్నాయి. తూర్పు లో కొద్దిగా వున్నాయి. నిన్నటి నుంచి దక్షిణ కోస్తాకు కూడా మొదలయ్యాయి. సో, దాదాపు ఆంధ్ర ఏరియా అంతా వర్షాలే వర్షాలు. దీంతో సినిమాలకు చాలా ఎఫెక్ట్ పడుతోంది. 

ప్రస్తుతం ఆడుతున్న వాటికే కలెక్షన్లు అంతంత మాత్రంగా వున్నాయి. అర్బన్ ఏరియాల్లో కాస్త ఫరవాలేదు కానీ, బి సి సెంటర్లలో పరిస్థితి చాలా బాలేదు. ఇలాంటి టైమ్ లో రేపు మరో రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. నాగ్ ప్రమోషన్ తో వస్తున్న నిర్మలా కాన్వెంట్, అలాగే టీవీ నుంచి వెండితెరకు వస్తున్న సాగర్ నాయుడు సినిమా సిద్దార్థ.

 ఇప్పటి వరకు వున్న పరిస్థితి ఇలా కొనసాగితే మాత్రం ఓపెనింగ్స్ కష్టం అవుతుంది. లేదూ, అదృష్టం బాగుండి తెరిపి ఇస్తే, ఫరవాలేదు. కానీ వాతావరణ శాఖ సూచనలు మాత్రం మరో మూడు రోజులు ఇలాగే వుంటుందని అంటున్నాయి.

Show comments