ఆదా శర్మ చూపించేదెప్పుడు.?

'హార్ట్‌ ఎటాక్‌', 'గరం', 'క్షణం' తదితర తెలుగు సినిమాల్లో నటించిన ఆదా శర్మ, బాలీవుడ్ సినిమా 'కమాండో-2'తో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ సినిమా కోసం ఆదా శర్మ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. జిమ్నాస్టిక్స్‌ నేర్చుకుంది. ఇంకా చాలా చాలానే చేసేసింది. ఇవన్నీ ఎందుకంటే, 'కమాండో-2' సినిమా కోసం ఫైట్స్‌ చేసెయ్యాలి గనుక. 

'కమాండో-2' సాధారణమైన సినిమా కాదట. ఇప్పటిదాకా చైనీస్‌ సినిమాల్లోనూ, హాలీవుడ్‌ సినిమాల్లోనూ మాత్రమే చూసిన స్టంట్స్‌, ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై తొలిసారిగా 'కమాండో-2'లో చేసేశారట. 'తుపాకీ' సినిమాలో విలన్‌గా నటించిన విద్యుత్‌ జమ్వాల్‌ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఆల్రెడీ ట్రైలర్‌ విడుదలయ్యింది. ట్రైలర్‌ చూస్తే, స్టంట్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అన్పించకమానదు. ట్రైలర్‌లో ఆదా శర్మ తళుక్కున మెరిసిందంతే. 

త్వరలో ఇంకో ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారట. అందులో ఆదా శర్మని పూర్తిస్థాయి స్టంట్‌ గర్ల్‌గా చూడొచ్చట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెబుతోంది. మొత్తమ్మీద, 'కమాండో-2' సినిమా కోసం చాలా డెడికేటెడ్‌గానే స్టంట్స్‌ నేర్చేసుకుంది ఆదా శర్మ. ఈ విషయంలో ఆమెను అభినందించకుండా వుండలేం. అన్నట్టు ’కమాండో-2’ మార్చి 3న విడుదల కానుంది.

Readmore!
Show comments