దిల్ రాజు ముందు జాగ్రత్త

ఎవరికి తెలియకపోయినా, అనుభవం పండిన నిర్మాతలకు తమ ప్రొడక్ట్ ఎలా వుంటుందో ముందే తెలిసిపోతుంది. ఆ మేరకే సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయడం లేదా, అస్సలు ప్రమోషన్ కూడా దండుగ అనుకోవడం ఇలాంటి వ్వవహారాలు వుంటాయి. ఇక శాటిలైట్ బిజినెస్ కూడా ఈ కోవలోకే వస్తుంది.

వన్స్ సమీక్షలు బయటకు వచ్చి, సరైన రేటింగ్ పడకపోతే, శాటిలైట్ రేటు ధభాల్న పడిపోతుంది. అందుకే వీలయినంత వరకు ముందే శాటిలైట్ చేసేసుకుందామని నిర్మాతలు చూస్తారు. సినిమా మీద డవుట్ వుంటే చానెళ్ల జనాలు అలా అలా నాన్చుతారు.

ఇంతకీ విషయం ఏమిటంటే చెలియా శాటిలైట్ ను నిర్మాత దిల్ రాజు కిందా మీదా పడి, గురువారం రాత్రికే ఫినిష్ చేసేసా అనిపించేసారట. కోటిన్నరకు శాటిలైట్ హక్కులు ఇచ్చేసారు. ఇదే మంచిదయింది. ఇప్పుడు సమీక్షలు పాజిటివ్ గా లేవు. శాటిలైట్ ఇబ్బంది అయ్యేది.

Show comments