తొలి రోజు చిన్న సినిమాగా మంచి కలెక్షన్లనే నమోదు చేసింది అంధగాడు సినిమా. ఏడు కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమాకు తొలి రోజు కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చింది.
కోటి రూపాయలకు కాస్త అటుగా కొన్న ఉత్తరాంధ్రలో తొలి రోజు 20 లక్షలు వసూలు చేసింది. కృష్ణలో 10 లక్షలు , గుంటూరు 15, ఈస్ట్ 9, వెస్ట్ పదిన్నర, సీడెడ్ 12, నైజాం 40 వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ ఫిగర్లు చూస్తుంటే, ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు ఫిఫ్టీ పర్సంట్ షేర్ వచ్చే లాగే కనిపిస్తోంది. మండే నుంచి మళ్లీ ఫ్రైడే దాకా స్టాండ్ కావడాన్ని బట్టి, ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ కావడం అన్నది ఆధారపడి వుంటుంది. తొలి రోజున వచ్చిన టాక్ చూస్తుంటే, ఈ సినిమా అర్బన్ ఏరియాల్లో కన్నా, బి సి సెంటర్లలో ఎక్కువగా పే చేసే అవకాశం వుంది.