ఎంప్లాయీస్ కోసం స్పెషల్ షోలు

రామ్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో  నిర్మించిన 'హైపర్‌' సినిమా ఓ ప్రభుత్వ ఉద్యోగి నిజాయతీ, సంతకం చుట్టూ తిరుగుతుంది.  ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా కొన్ని చోట్ల ప్రదర్శించాలని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాతలు. 

ఈ చిత్రంలో సత్యరాజ్‌ చేసిన క్యారెక్టర్‌ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రిలేట్‌ అవుతుందని, తప్పకుండా వాళ్ళందరికీ ఈ సినిమా లో మెసేజ్ ఆ విధంగా అందుతుందని భావిస్తున్నారు.  రామ్‌ ఎనర్జిటిక్‌ పెర్‌ఫార్మెన్స్‌, నిజాయితీగల ప్రభుత్వ ఉద్యోగిగా సత్యరాజ్‌ ప్రదర్శించిన నటన, అబ్బూరి రవి రాసిన మాటలు, 'హైపర్‌' చిత్రానికి ప్లస్ పాయింట్లని నిర్మాతలు పేర్కొన్నారు. 

Show comments