హమ్మయ్య స్పైడర్ క్లారిటీ ఇచ్చేసాడు

మొత్తానికి స్పైడర్ సినిమా డేట్ దసరాకే అన్నది క్లియర్ అయిపోయింది. ఇప్పటికి రెండు సార్లు డేట్ మారడంతో, దసరాకే విడుదల అని చెప్పినా కూడా సినిమా జనాలు అనుమానంగా వున్నారు. ఆఖరికి ఇప్పడు విడుదలైన టీజర్ లో దసరా విడుదల అని క్లియర్ గా వేసేసారు.

డేట్ వాళ్లు ప్రకటించకపోయినా, 27 సెప్టెంబర్ అని బయటకు వచ్చేసింది. అందవల్ల ఇక పూరి-బాలయ్య సినిమా కన్నా రెండు రోజులు ముందే రంగంలోకి వస్తున్నాడు స్పైడర్. అదే నెల ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్-బాబి కాంబినేషన్ జై లవకుశ రాబోతోంది. అందవల్ల ఇక పవన్-త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికే అన్నది ఫిక్స్.

ఇదిలా వుంటే అభిమానులను ఊరించి.. ఊరించి వదలిన స్పైడర్ టీజర్ అభిమానులకు సినిమాపై అంచనాలను పెంచుతుందనడంలో సందేహం లేదు. బాక్స్ అలా అలా విడి, సాలె పురుగుగా మారడం, అది కాస్తా అలా అలా మహేష్ భుజాల మీదకు చేరడం కాస్త ఇంట్రెస్టింగ్ వుంటూనే, సినిమా ప్లాట్ ఎలా వుండబోతోందో చెప్పకనే చెప్పింది.

టీజర్ లోనే ఇలా ఇండస్ట్రింగ్ గా గ్రాఫిక్స్ వుంటే ఇక సినిమాలో ఎలా వుంటాయో? పైగా బాహుబలి లాంటి సినిమాకు గ్రాఫిక్స్ అందించిన మకుట సంస్థ ఈ సినిమాకూ పనిచేస్తోంది. సంతోష్ శివన్ లాంటి ఏస్ ఫొటోగ్రాఫర్ తోడయ్యారు.

Readmore!

Show comments