ఈ బోయపాటికి ఏమయింది?

ఏదో చేస్తున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. డవుటే లేదు. మాంచి ప్రేమ కథ కావాలి.. మాంచి ప్రేమ కథ కావాలి అంటూ వెదికారు సరైనోడు సక్సెస్ తరువాత. అలాగదే అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేసారు. సినిమా పూర్తిచేసి టైటిల్ వదిలితే అందరికీ ఆశ్చర్యం. జయ.. జానకి.. నాయక అంటూ అచ్చమైన సాప్ట్ టైటిల్. సర్లే, డిఫరెంట్ గా ఏదో చూపిస్తారు అనుకుంటే ఇంతలోనే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మజిల్ పవర్ తెలిసేలా ఓ లుక్. దాంతో పైకి కొత్తగా వుందని ట్రయ్ చేస్తున్నారు. లోపల అసలు బోయపాటి అలాగే వున్నారు అనుకున్నారు.

లేటెస్ట్ గా టీజర్ వదిలారు. ఎంత సాఫ్ట్ గా వుందీ అంటే, ఇంక ఇంతకన్నా సాఫ్ట్ గా బోయపాటి టీజర్ ఇవ్వలేరు అనేంత. మామూలుగా అయితే ఏముందీ టీజర్ లో అనేయచ్చు. కానీ అది బోయపాటి నుంచి వచ్చేసరికి? ఇంత సాఫ్ట్ అండ్ ప్లెజెంట్ టీజర్ ఇవ్వడంలో బోయపాటి ఉద్దేశం ఏమై వుంటుంది? బోయపాటి నుంచి ప్రేక్షకులు ఆశించేవి ఎలాగూ అందరికీ తెలుసు. వాటికి అదనంగా ఇచ్చేవాటిని మాత్రం బోయపాటి బయటకు చెబుతున్నట్లు కనిపిస్తోంది. మాంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ లవ్ స్టోరీని అందిస్తూనే, వాటికి తన స్టయిల్ మాస్ జోష్ జోడిస్తారని వినికిడి.

మొత్తంమీద బోయపాటి ఏదో చేస్తున్నారు. తనేంటో చూపించాలని అనుకుంటున్నట్లుంది. 

Show comments