అల్లు అర్జున్ వేరు కుంపటి?

మెగా ఫ్యాన్స్ అనేది అవుటర్ లుక్ మాత్రమే. అందులో మళ్లీ మెగా ఫ్యాన్స్, పవర్ ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఇలా మూడు కుంపట్లు. నిష్టూరంగా వున్నా ఇది వాస్తవమే. రాను రాను ఈ గ్యాప్ మరింత వైడ్ అవుతోంది తప్ప, దగ్గర కావడం లేదు. చరణ్ కు బన్నీ కి మధ్య దూరం ఆ మధ్య ఖైదీ ప్రీ సక్సెస్ మీట్ లో దగ్గర నుంచి చూసిన వారికి తెలిసింది. బన్నీ కారణంగానే గీతా మనుషులు ఎవరూ చరణ్ కు నప్పడం లేదన్నది, ఆయన తన బ్యాచ్ ను తాను రెడీ చేసుకున్నదీ వాస్తవమే. బన్నీ మనుషులు అనేవారిని తన దగ్గరకు రాన్వివ్వడం లేదన్నది తెలిసిందే. 

ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే వీలయినపుడల్లా బన్నీని టార్గెట్ చేస్తున్నారు. అది చాలా సార్లు ఇప్పటికే ప్రూవ్ అయింది. అందువల్ల అటు చరణ్ తో సరిపడడం లేదు. ఇటు పవర్ ఫ్యాన్స్ తో సమస్యలు తప్పడం లేదు. 

అందుకే ఇక బన్నీ కూడా తన వ్యవహారాలు తాను చక్క బెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు మెగా ఫ్యాన్స్ మీట్ లు అంటే స్వామినాయుడో లేదా నాగబాబో ఇలా వాళ్ల సారథ్యంలో జరిగేవి. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ వేరుగా మీట్ ను బన్నీ కోసం నిర్వహించినట్లు తెలుస్తోంది. అల్లు శిరీష్ ఇప్పుడు అల్లు కమ్ బన్నీ ఫ్యాన్స్ టీమ్ ను కో ఆర్డినేట్ చేస్తున్నట్లు వినికిడి. నాగబాబు కూడా అటు అన్నదమ్ములతోనే వుంటున్నారు. స్వామినాయుడు మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ లో వుంటున్నారు. అందుకే ఇక తమ ఫ్యాన్స్, తమ టీమ్, తమ కో ఆర్డినేషన్ అనే థాట్ తో బన్నీ ముందుకు వెళ్తున్నట్లు వినికిడి. దీనికి సంబంధించి ఇటీవలే తొలి మీట్ జరిగినట్లు వార్తలు వినవస్తున్నాయి.

Show comments