సునీల్ అడిగితే.. వెంకీకి ఇచ్చాడు

డైరక్టర్ త్రివిక్రమ్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబో సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడన్న వార్త గుప్పు మంది. వెంకీ కనిపించే ఈ క్యారెక్టర్ సుమారు ఆరు నిమషాలు పాటు వుంటుంది. వెంకీ-పవర్ స్టార్ మధ్య ఆ ఆరు నిమషాలు హిలేరియస్ డైలాగులు పడతాయి.

ఇదిలా వుంటే ఇదే పాత్ర గురించి ముందుగా తెలిసి, హీరో కమ్ కమెడియన్ సునీల్ తాను చేస్తానని సరదా పడినట్లు తెలుస్తోంది. సునీల్, డైరక్టర్ త్రివిక్రమ్ చాలా కాలం నుంచి సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. ప్రతీది ఇద్దరి మధ్య డిస్కషన్ కు వస్తుంటుంది.

అలా ఈ పాత్ర గురించి తెలియడంతో, సునీల్ తాను చేస్తానని అన్నాడని వినికిడి. నువ్వు చేస్తానంటే దాన్ని ఇంకా పెంచాలి. ఆలోచిస్తా అని త్రివిక్రమ్ అనేసి ఊరుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, అంతగా సునీల్ తన సినిమాల్లో చేస్తానంటే, తరువాతి సినిమాల్లో మాంచి క్యారెక్టర్ రాస్తా అని మాటిచ్చినట్లు తెలుస్తోంది.

కానీ మరి పెంచుతా అన్న పాత్రను అలాగే వుంచి వెంకీకి ఎందుకు ఇచ్చినట్లో తెలియదు. బహుశా త్రివిక్రమ్ కు సునీల్ నేస్తం అయినట్లే, పవన్ కు వెంకీ మాంచి ఫ్రెండ్ కదా? అందుకే అయివుంటుంది.

Show comments