లెజెండ్ దగ్గర నుంచి ట్రాక్ మారిపోయారు జగపతి బాబు. అలా అని వచ్చిన ప్రతి పాత్ర ఓకే అనేయడం లేదు. తను చేసాడు అంటే.. సమ్ థింగ్.. వుండాలి అనేటట్లు చూసుకుంటున్నాడు. దీంతో వైవిధ్య మైన పాత్రలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఇటు తెలుగులో, అటు తమిళంలో చకచకా సినిమాలు చేస్తూ, ఇప్పుడు రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల రెమ్యూనిరేషన్ తీసుకునే స్టేజ్ కు చేరుకున్నాడు.
ఇక లేటెస్ట్ సంగతి ఏమిటంటే.. మరో మంచిపాత్రను కూడా జగపతి బాబు ఓకె చేసారు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ హీరోగా నటించే సినిమాలో హీరో ఫాదర్ క్యారెక్టర్ ను జగపతి చేయబోతున్నారు. ఈ పాత్ర సినిమాలో కీ రోల్ గా వుంటుదట. అందుకే జగపతి కి ఆఫర్ చేయడం, ఆయన ఓకె చేయడం జరిగిపోయాయి.