1948 కోట్లు.. స్టిల్ నాటౌట్

ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ అయిన దంగల్ సినిమా ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇన్ని రోజులైనా చైనాలో ఈ సినిమాకు రోజుకు 10 లక్షల డాలర్లకు తగ్గకుండా వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా వసూళ్లు 1948 కోట్ల రూపాయలకు చేరాయి.

నిన్నటికి చైనాలో దంగల్ కు 1164 కోట్ల రూపాయలు వచ్చాయి. అటు తైవాన్ లో ఈ సినిమాకు 40 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇండియాలో వచ్చిన వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమాకు నిన్నటికి 1948 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

మరో 10 రోజుల్లో ఇది 2000 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశముంది. అదే కనుక జరిగితే వరల్డ్ హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్ లో చేరిన తొలి భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టిస్తుంది.

ఇప్పటివరకు ఈ లిస్ట్ లో అన్నీ హాలీవుడ్, చైనీస్ సినిమాలు మాత్రమే కనిపించాయి. దంగల్ కు కనుక 2వేల కోట్ల రూపాయల వసూళ్లు వస్తే... ఇకపై వరల్డ్ వైడ్ టాప్-20 సినిమాల లిస్ట్ లో దంగల్ కూడా కనిపిస్తుంది.

త్వరలోనే ఈ సినిమాను హాంకాంగ్ లో విడుదల చేయబోతున్నారు. సో.. వరల్డ్ టాప్-20లో చేరడం దంగల్ కు ఏమంత కష్టం కాకపోవచ్చు.

Show comments