డిజిటల్ వర్క్ అదిరిందిగా

ఎంతయినా టెక్నికల్ వర్క్ జోడిస్తే వచ్చే అందమే వేరు. మహేష్ బాబు స్పయిడర్ సినిమా డిజిటల్ పోస్టర్ ఈ విషయం చెప్పక చెబుతుంది. స్పయిడర్ డిజిటల్ మోషన్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసారు. ఈ పోస్టర్ టెక్నికల్ వర్క్ అంతా విదేశాల్లో చేయించారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్ కు ఈ పోస్టర్ కు మధ్య తేడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. రెగ్యులర్ పోస్టర్ లు అంటే టోటల్ సీన్ ను రెండు మూడు ముక్కలుగా చేసి వన్ బై వన్ స్క్రీన్ మీదకు వస్తాయంతే.

కానీ ఈ డిజిటల్ మోషన్ పోస్టర్ చాలా రియలిస్టిగా వుంది. పోస్టర్ అలావచ్చి, ఇలా ఫుల్ ఫార్మ్ సంతరించుకుని,టైటిల్స్, వాటిపై ఫ్లాష్ లుక్ రావడం అన్ని విధాలా రిచ్ నెస్ కనిపిస్తోంది. అయితే నేఫథ్యం సంగీతం మాత్రం కాస్త మరీ క్లాస్ టచ్ తోవుంది. ఈ లుక్ కు తగ్గట్లు మరి కాస్త బ్యాంగ్ తో వుండే బాగుండేదనిపించింది. మొత్తం మీద కాస్త లేట్ గా వచ్చినా మంచి పోస్టర్ తో వచ్చాడు మహేష్ బాబు.

Show comments